నిర్గమకాండం i
నిర్గమకాండం (దాస్యవిముక్తి)
పరిచయం
పేరు:
యూదులు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి వచనంలోని పదాలయిన “...పేర్లు ఇవి” అని పిలిచేవారు (హీబ్రూలో ఇవి మొదటి రెండు మాటలు). తరువాత దీన్ని “పేర్లు” అని చిన్నగా చేశారు. ఆదికాండంలోని “పరిచయం” చూడండి. పాత తెలుగు బైబిలు(అంటే పరిశుద్ధగ్రంథం)లోని పుస్తకాల పేర్లన్నీ ఇతర భాషల్లోని బైబిళ్ళనుంచి తర్జుమా చేశారేగాని మూలభాష అయిన హీబ్రూ నుంచి కాదు. ఇక్కడ “నిర్గమకాండం” అనేకంటే దాస్యవిముక్తి అనడమే బాగుంటుందనిపిస్తుంది.
రచయిత, వ్రాసిన కాలం:
ఆదికాండం పరిచయం చూడండి.
ముఖ్యాంశం:
ఇస్రాయేల్‌ప్రజలకు దాసత్వంనుంచి విడుదల కలగడం అనేది మొదటి భాగం యొక్క ముఖ్యాంశం. దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి? ఎలా ఆరాధించాలి? అన్నది రెండవ భాగం ముఖ్యాంశం. ఈ పుస్తకమంతా ఆధ్యాత్మికమైన, సాదృశ్యమైన అర్థాలతో కూడి ఉండి నేటి విశ్వాసులకోసం కూడా మంచి ఉపదేశాలతో పాఠాలతో నిండివున్నది.
విషయసూచిక
ఈజిప్ట్‌లోని దాసత్వం 1:1-22
మోషే పుట్టుక, బాల్యం 2:1-10
మోషే మిద్యానుకు పలాయనం, 40 సంవత్సరాలపాటు అక్కడే ఉండిపోవడం 2:11-24
మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేను పిలిచి
అతన్ని ఈజిప్ట్‌కు పంపడం 3:1—4:17
మోషే అభ్యంతరాలు 3:11-13
దేవుడు తన పేరును ప్రకటించడం 3:14-15
మోషే మళ్ళీ అభ్యంతరం చెప్పడం, దేవుడు
అతనికి అద్భుతమైన శక్తులు ఇవ్వడం 4:1-9
మోషే మూడవ అభ్యంతరం 4:10-12
ఇంకెవరినైనా పంపమని మోషే దేవుణ్ణి అడగడం 4:13-17
మోషే ఈజిప్ట్‌కు తిరిగి రావడం 4:18-31
అహరోను, మోషే ఫరో దగ్గరకు వెళ్ళడం 5:1-21
దాస్య విముక్తి కలిగిస్తానని దేవుని వాగ్దానం 5:22—6:12
అహరోను చేతికర్ర పాముగా మారడం 7:9-13
ఈజిప్ట్‌పై దేవుడు పంపిన విపత్తులు 7:14—12:30
నీరు రక్తంగా మారడం 7:14-24
కప్పలు 7:25—8:15
దోమలు 8:16-19
ఈగలు 8:20-32
పశువుల చావు 9:1-7
కురుపులు 9:8-12
వడగండ్లు 9:13-35
మిడతలు 10:1-20
చీకటి 10:21-24
మొదట పుట్టిన సంతానం చావడం 11:1—12:30
పస్కా పండుగ 12:1-28
ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌ను విడిచి వెళ్ళడం 12:31-42
పస్కా పండుగ గురించి ఆదేశాలు 12:43-50
మొదటి సంతానాన్ని గురించి ఆదేశాలు 13:1-16
మేఘం, అగ్ని స్థంభాలు 13:20-22
ఇస్రాయేల్‌ప్రజలు ఎర్ర సముద్రం దాటడం, ఫరో సైన్యాలు అందులో మునిగిపోవడం 14:1-31
విముక్తి పాట 15:1-21
మారా ఏలీంల నీళ్ళు 15:22-27
దేవుడు మన్నాను, పూరేడు పిట్టలను ఆహారంగా ఇవ్వడం 16:1-36
దేవుడు బండరాయి నుంచి నీరు ఇవ్వడం 17:1-7
అమాలేకుతో యుద్ధం 17:8-15
మోషే మామగారు 18:1-27
సీనాయి పర్వతం మీద దేవుడు, ఇస్రాయేల్ ప్రజలు 19:1-25
ధర్మశాస్త్రంతో కూడిన ఒడంబడిక 19:5-8
పది ఆజ్ఞలు 20:1-17
మరిన్ని చట్టాలు, ఆదేశాలు 20:22—23:13
ఏటేటా జరిగే మూడు పండుగలు 23:14-17
ఇస్రాయేల్ ప్రజలకు దారి చూపడానికి దేవుని దూత 23:20-23
ఒడంబడికను స్థిరపరచడం 24:1-18
దేవుడు ఆరాధన గుడారం గురించి ఆదేశాలివ్వడం 25:1—31:18
పెట్టె 25:10-22
బల్ల 25:23-30
దీపస్తంభం 25:31-40
గుడారం 26:1-37
బలిపీఠం 27:1-8
ఆవరణం 27:9-19
నూనె 27:20-21
యాజుల వస్త్రాలు 28:1-43
యాజుల ప్రతిష్ఠ 29:1-45
ధూపవేదిక 30:1-10
ప్రాయశ్చిత్తం కోసం వెండి 30:11-16
కడగడానికి కంచు గంగాళం 30:17-21
అభిషేక తైలం 30:22-33
ధూపద్రవ్యం 30:34-38
కట్టేవాళ్ళు 31:1-11
విశ్రాంతి దినం 31:12-18
బంగారు దూడ 32:1-29
మోషే దేవునితో ప్రాధేయపడడం 32:30-34
సన్నిధి గుడారం 33:7-11
దేవుని మహిమను చూడాలనే మోషే విన్నపం 33:12-23
మోషే దేవుని మహిమను చూడడం, దేవుడు తన పేరును ప్రకటించడం 34:1-7
దేవుడు మరిన్ని ఆదేశాలు ఇవ్వడం 34:10-28
మోషే ముఖం ప్రకాశించడం 34:29-35
ఆరాధన గుడారం కట్టడానికి ప్రజలు తేవలసిన కానుకలు 35:4—36:7
ఆరాధన గుడారం నిర్మాణం 36:8—40:33
ఆరాధన గుడారం దేవుని మహిమతో నిండడం 40:34-38